డిసెంబర్‌లో కర్ణాటక గ్రామ పంచాయతీ ఎన్నికలు

కన్నడ గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు రాష్ట్ర్రంలోని 5,700 లకు పైగా గ్రామ పంచాయతీలకు డిసెంబర్‌ 22,27 న రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర్ర ఎలక్షన్‌ కమిషనర్‌ బి. బసవరాజు  సోమవారం తెలిపారు. ఎన్నికల ఫలితాలు 30వ తేదీన వెల్లడించనున్నట్లు చెప్పారు.  ఆయన మాట్లాడుతూ...

Published : 30 Nov 2020 20:24 IST

బెంగళూరు: కన్నడ గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు రాష్ట్రంలోని 5,700లకు పైగా ఉన్న గ్రామ పంచాయతీలకు డిసెంబర్‌ 22, 27న రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎలక్షన్‌ కమిషనర్‌ బి. బసవరాజు  సోమవారం తెలిపారు. ఎన్నికల ఫలితాలు 30వ తేదీన వెల్లడించనున్నట్లు చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 6,004 గ్రామ పంచాయతీలకు గానూ కేవలం 5,762 గ్రామ పంచాయతీలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికీ 162 గ్రామ పంచాయతీల్లో  పదవీ సమయం పూర్తి కాలేదు. ఆరు స్థానాల్లో కోర్టు కేసులు నడుస్తున్నాయి. 74 గ్రామ పంచాయతీలు పట్టణ పంచాయతీలుగా మారాయి.  మొత్తం 92,121 గ్రామ పంచాయతీ వార్డులు ఉన్నాయి. 2.97 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ కోసం 45,128 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఓటింగ్‌ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. కొవిడ్‌-19 దృష్ట్యా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కమిషన్‌ తెలిపింది. డిసెంబర్‌ 11, 16లను నామినేషన్‌ వేయడానికి చివరి తేదీలుగా ప్రకటించారు. నామినేషన్‌ ఉపసంహరణకు డిసెంబర్‌  14, 19 చివరి తేదీ.  గ్రామ పంచాయతీ ఎన్నికలు కీలకమైనవని గతంలో ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని