‘బతకలేకపోతే.. చస్తే మరీ మంచిది’

‘బతకలేకపోతే.. చస్తే మరీ మంచిది. మేమిచ్చేది ఇంతే’ అని ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని కోరిన ఓ ఉద్యమ

Updated : 29 Apr 2021 11:52 IST

కర్ణాటక మంత్రి దురుసు సమాధానం

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు : ‘బతకలేకపోతే.. చస్తే మరీ మంచిది. మేమిచ్చేది ఇంతే’ అని ఐదు కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని కోరిన ఓ ఉద్యమ ఆందోళనకారుడికి కర్ణాటక రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల మంత్రి ఉమేశ్‌ కత్తి ఇచ్చిన సమాధానం ఇది. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవడంతో తాను మాట్లాడింది నిజమేనంటూ అంగీకరించిన మంత్రి.. చివరకు క్షమాపణ చెప్పారు. రాష్ట్రంలో ఉచితంగా ఇవ్వాల్సిన ఐదు కిలోల బియ్యాన్ని రెండు కిలోలకు తగ్గించిన సర్కారు.. ప్రత్యామ్నాయంగా గోధుమలు, జొన్నలు ఇస్తోంది. లాక్‌డౌన్‌ సమయంలో రెండు కిలోల బియ్యం ఏమాత్రం సరిపోవని గదగ జిల్లాలో రైతులు ఆందోళనబాట పట్టారు. సమస్య తీవ్రతను ఆందోళనకారుల్లో ఒకరైన ఈశ్వర ఆర్య బుధవారం మంత్రికి ఫోన్‌ చేసి వివరించారు. ఈ సందర్భంగా ‘బతకలేకపోతే.. చస్తే మరీ మంచిది. మేమిచ్చేది ఇంతే’ అంటూ కఠినంగా బదులిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని