Published : 08 Dec 2020 11:41 IST

గృహ నిర్బంధంలో కేజ్రీవాల్‌: ఆప్‌

ఖండించిన దిల్లీ పోలీసులు

దిల్లీ: రైతులు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ నేపథ్యంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచినట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపించింది. సోమవారం సాయంత్రం నుంచి ఆయన నివాసంలోకి ఎవరినీ అనుమతించడం లేదని తెలిపింది. అలాగే కేజ్రీవాల్‌ను కూడా ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదని ఆరోపించింది. సోమవారం సింఘు ప్రాంతంలో రైతుల్ని పరామర్శించి సంఘీభావం తెలిపినప్పటి నుంచి ఆయన నివాసం వద్ద భారీస్థాయిలో బలగాల్ని మోహరించినట్లు వెల్లడించింది.

నిన్న సాయంత్రం ఆప్‌ ఎమ్మెల్యేలకు సీఎం కేజ్రీవాల్‌ సమావేశం ఉండిందని ఆప్‌ నేత సౌరభ్‌ భదరద్వాజ్‌ తెలిపారు. దీంతో ఆయనను కలిసేందుకు వెళ్లిన శాసన సభ్యులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారని ఆరోపించారు. దీనిపై స్పందించిన పోలీసులు కేజ్రీవాల్‌ గృహనిర్బంధంలో లేరని తెలిపింది. బంద్‌ నేపథ్యంలో ఆప్‌ కార్యకర్తలకు, ఇతర పార్టీలకు మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా బలగాల్ని మోహరించామని నార్త్‌ దిల్లీ డీసీపీ ఆంటూ ఆల్ఫోన్స్‌‌ స్పష్టం చేశారు.

రైతుల దీక్షాస్థలి అయిన సింఘు సరిహద్దుకు కేజ్రీవాల్‌ సోమవారం వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఏర్పాట్లను సమీక్షించారు. ముఖ్యమంత్రిగా కాకుండా ‘సేవాదార్‌’గా వచ్చినట్టు తెలిపారు. బంద్‌కు ఆప్‌ మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు.

ఇవీ చదవండి..

రైతులకు మద్దతుగా అన్నాహజారే నిరాహారదీక్ష

రైతులకు అమెరికా నేతల మద్దతు!

భారత్‌ బంద్‌: రోడ్డెక్కిన రైతులు.. నిలిచిన రైళ్లు

భారత్‌ బంద్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని