సీఎంతో నెలవారీ సమావేశాలు నిర్వహించండి

కాలుష్య నివారణ కోసం పంజాబ్‌, హరియాణా, దిల్లీ, యూపీ ముఖ్యమంత్రులతో నెలవారీ సమావేశాలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ను అరవింద్‌ కేజ్రీవాల్‌ అభ్యర్థించారు. సమస్యను పరిష్కరించడంలో

Published : 20 Oct 2020 01:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాలుష్య నివారణ కోసం పంజాబ్‌, హరియాణా, దిల్లీ, యూపీ ముఖ్యమంత్రులతో నెలవారీ సమావేశాలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అభ్యర్థించారు. సమస్యను పరిష్కరించడంలో ఆయా రాష్ట్రాల స్థాయిలో రాజకీయ పరమైన సంకల్పం లేదని పేర్కొన్నారు. మీడియాతో ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడుతూ...‘‘పంట వ్యర్థాలను బయోడీగ్రేడ్‌ చేయవచ్చు. లేదా బయో బ్యాగులు తదితరాలుగా మార్చి ఉపయోగించవచ్చు. అయితే ఆయా రాష్ట్రాలు పంట వ్యర్థాల దహనం ఆపడం, వాయు కాలుష్య నివారణ వంటి వాటి గురించి ఒప్పందం కుదుర్చుకోలేదు. వీటి దహనం వల్ల కలిగే కాలుష్యాన్ని చాలా తక్కువ రోజుల్లోనే నియంత్రించవచ్చు. అయితే దానికి రాజకీయ పరమైన సంకల్పం అవసరం’’ అని కేజ్రీవాల్ అన్నారు.

ఎన్విరాన్‌మెంట్ మార్షల్స్‌..

దిల్లీ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కాలుష్య నివారణ ప్రచారం గురించి అవగాహన కల్పించనుంది. ఇందుకోసం నగరం అంతటా 2500 మంది ఎన్విరాన్‌మెంట్ మార్షల్స్‌ను నియమించనున్నట్లు పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌ వెల్లడించారు. ‘‘ఈ మార్షల్స్‌ గాంధీగిరి సూత్రాలను పాటిస్తారు. ట్రాఫిక్‌లో రెడ్‌ సిగ్నల్‌ పడినప్పుడు ఇంజిన్‌లను ఆపివేయని వారికి ఎర్రగులాబీలు ఇస్తారు. కాలుష్య నియంత్రణ గురించి అవగాహన కల్పిస్తారు’’ అని ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని