శబరిమల వెళ్తే.. కరోనా పరీక్ష తప్పనిసరి

కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తుండటంతో కేరళ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. ఈ నెల 26 తర్వాత అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు, ఆలయం వద్ద పనిచేసే .........

Updated : 15 Dec 2020 21:08 IST

కేరళ సర్కార్‌ తాజా మార్గదర్శకాలు

తిరువనంతపురం: కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తుండటంతో కేరళ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. ఈనెల 26 తర్వాత అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు, ఆలయం వద్ద పనిచేసే అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయించుకొని రావాల్సిందేనని స్పష్టంచేసింది. కేరళలో గత కొన్ని రోజులుగా కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ కరోనా మార్గదర్శకాలను సవరించినట్టు వైద్యశాఖ మంత్రి కేకే శైలజ తెలిపారు. ఈ నెల 26న మండల పూజ అనంతరం అయ్యప్ప క్షేత్రం వద్ద విధులు నిర్వహించే సిబ్బంది, దర్శనానికి వచ్చే భక్తులకు కరోనా పరీక్షలను తప్పనిసరి చేసినట్టు ఆమె చెప్పారు. 

గత నెల రోజుల కాలంలో ఆలయం వద్ద 299 మందికి (51మంది భక్తులు, 245 మంది సిబ్బంది, మరో ముగ్గురు) కరోనా వైరస్‌ సోకినట్టు వైద్యశాఖ అధికారులు తెలిపారు. అందువల్ల శబరిమలకు వచ్చే భక్తులు నీళక్కల్‌ బేస్‌క్యాంపు చేరుకొనేందుకు 24గంటల ముందే ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష చేయించుకొన్నట్టుగా ఉన్న  కొవిడ్‌ నెగిటివ్‌ సర్టిఫికేట్‌ చూపించాల్సి ఉంటుందన్నారు. ఇటీవలి కాలంలో పలు రాష్ట్రాల్లో, ప్రపంచంలో జరిగిన పలు కార్యక్రమాల్లో కరోనా విజృంభించినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో శబరిమలలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టిసారించామన్నారు. సిబ్బంది, భక్తజనం కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. శబరిగిరులపై ట్రెక్కింగ్‌ చేస్తున్నప్పుడు భక్తులు భౌతికదూరం పాటించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని