కేరళ విమాన ప్రమాదం: 56మంది డిశ్చార్జి

కేరళలో జరిగిన విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 18మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో వందమందికి పైగా గాయపడిన వారిని వివిధ ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

Published : 10 Aug 2020 23:39 IST

వెల్లడించిన ఎయిర్‌ ఇండియా సంస్థ

కొలికోడ్‌: కేరళలో జరిగిన విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 18మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరో వందమందికి పైగా గాయపడిన వారిని వివిధ ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పూర్తిగా కోలుకున్న 56మంది ప్రయాణికులు ఆయా ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు ఎయిర్‌ఇండియా ప్రకటించింది. బాధిత కుటుంబాలకు తోడుగా ఉండేందుకు ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సీఈవోతోపాటు మరికొంతమంది ఉన్నతాధికారులు కొలికోడ్‌లోనే ఉన్నట్లు విమానయాన సంస్థ ప్రకటన చేసింది. విమాన ప్రమాదం జరిగిన వెంటనే సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్న మలప్పురం ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది. ఆపత్కాలంలో మానత్వాన్ని చాటుతూ ప్రమాదంలో చిక్కుకుపోయిన వారిని రక్షించిన స్థానికులకు రుణపడి ఉంటామని ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌ పేర్కొంది.

దుబాయి నుంచి కొలికోడ్‌ వస్తున్న ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం రన్‌వేపై అదుపుతప్పి జారిపడటంతో రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పైలట్లు, 16మంది ప్రయాణికుల మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది.

ఇవీ చదవండి..
కేరళ విమాన ప్రమాదం: తొలి 5 నిమిషాల్లో ఏం జరిగిందంటే..!
ఆదుకున్న ఆపద్బాంధవులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని