ట్రంప్‌ స్వింగ్‌ బాల్‌..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కౌంటింగ్‌ ఉత్కంటగా సాగుతోంది. కౌంటింగ్‌లో తొలుత డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌ ముందజంలో ఉండగా.. ఆ తర్వాత మెల్లగా ట్రంప్‌ పుంజు కొన్నారు.

Updated : 04 Nov 2020 11:15 IST

 ఒపీనియన్‌ పోల్స్‌ తలకిందులు..

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌ ఉత్కంఠగా సాగుతోంది. తొలుత డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌‌ ముందంజలో ఉండగా.. ఆ తర్వాత ట్రంప్‌ క్రమంగా పుంజుకొన్నారు. కీలక రాష్ట్రాలైన స్వింగ్‌ స్టేట్స్‌లో ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ తొలుత ప్రకటించిన సర్వేల్లో మాత్రం బైడెన్‌ ‌ ఆధ్యిక్యంలో ఉన్నట్లు చూపించారు. వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ప్రస్తుతం అరిజోనా, న్యూహాంప్‌షైర్‌ మినహా మిగిలిన అన్ని చోట్ల ట్రంప్‌ ఆధిక్యం కొనసాగుతోంది. ఫ్లోరిడా, ఐయోవా, ఒహైయోలో విజయం సాధించగా.. నార్త్‌ కరోలినాలో విజయానికి దగ్గరలో ఉన్నారు. జార్జియా, మిషిగాన్‌, పెన్సిల్వేనియా, టెక్సాస్‌, విస్కాన్సిన్‌‌లలో ఆయన స్పష్టమైన ఆధిపత్యం కనబరుస్తున్నారు. 

అర్బన్‌ ఓటర్లు బైడెన్‌ పక్షం..

అమెరికాలో అర్బన్‌ ఓటర్లు ఉండే న్యూయార్క్‌, వాషింగ్టన్‌, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో డెమొక్రాటిక్‌ పార్టీకి తిరుగులేని విజయాలు లభించాయి. కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో  ఫలితాలు త్వరగా రావడంతో తొలుత బైడెన్‌‌ ఆధిపత్యం కనిపించింది. ట్రంప్‌ నేతృత్వంలోని రిపబ్లికన్‌ పార్టీ ఆధిపత్యం ఉన్న రాష్ట్రాల్లో ఫలితాలు నెమ్మదిగా వస్తుండటంతో ఆయన ఆధిపత్యం కొంత తక్కువగా ఉంది. ఫాక్స్‌ న్యూస్‌ లెక్కల ప్రకారం కడపటి సమాచారం అందే సమయానికి బిడెన్‌ 227 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించగా.. ట్రంప్‌ 210 ఓట్లు పొందారు. స్వింగ్‌ స్టేట్స్‌లో ఇప్పుడున్న పరిస్థితే చివరి వరకు కొనసాగితే మాత్రం ఫలితాలు ట్రంప్‌కు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని