లాలూ ఆరోగ్యం ఎప్పుడైనా క్షీణించొచ్చు

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ ఆరోగ్యం ఏ క్షణంలోనైనా క్షీణించొచ్చని రాంచీలోని రిమ్స్‌ వైద్యుడు డాక్టర్‌ ఉమేశ్‌ ప్రసాద్‌ అన్నారు. ఆయన కిడ్నీలు....

Published : 13 Dec 2020 02:15 IST

రాంచీ: బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ ఆరోగ్యం ఏ క్షణంలోనైనా క్షీణించొచ్చని రాంచీలోని రిమ్స్‌ వైద్యుడు డాక్టర్‌ ఉమేశ్‌ ప్రసాద్‌ అన్నారు. ఆయన కిడ్నీలు 25శాతం మాత్రమే పనిచేస్తున్నాయని, భవిష్యత్‌లో ఎప్పుడైనా ఆయన ఆరోగ్యం క్షీణించొచ్చని చెప్పారు. ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్న లాలూ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న ఆయన.. లాలూ ఆరోగ్యం గురించి ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు చెప్పారు.

లాలూ 20 ఏళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్నారని, అందువల్ల కిడ్నీ పనితీరు క్రమంగా క్షీణించిందని డాక్టర్‌  ప్రసాద్‌ అన్నారు. డయాబెటిస్‌ వల్ల పాడైన అవయవాలు పనితీరు మెరుగుపడడం సాధ్యపడదన్నారు. ఎలాంటి మందులూ కిడ్నీ పనితీరును 25 నుంచి 100 శాతానికి పెంచబోవని చెప్పారు. రెసిడెంట్‌ నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించిన అనంతరం ఆయనకు ఎలాంటి వైద్యం అందించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మరోవైపు దాణా కుంభకోణానికి సంబంధించిన ఓ కేసులో బెయిల్‌ లభించినప్పటికీ మరో కేసులో లాలూకు ఊరట లభించలేదు. లాలూ తరఫు న్యాయవాది బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఆ కేసును ఝార్ఖండ్‌ హైకోర్టు ఆరు వారాల పాటు వాయిదా వేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని