శ్రీలంక అదుపులో 47మంది భారత జాలర్లు

శ్రీలంక నావికాదళం అధికారులు 47 మంది భారత మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. తమ దేశ సరిహద్దులో చేపలు పట్టడానికి వెళ్లారంటూ ఆరోపిస్తూ అరెస్టు.......

Published : 14 Dec 2020 22:29 IST

రామేశ్వరం: శ్రీలంక నావికాదళం అధికారులు 47 మంది భారత మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. తమ దేశ సరిహద్దులో చేపలు పట్టడానికి వెళ్లారంటూ ఆరోపిస్తూ అరెస్టు చేశారు. రామేశ్వరం, పుత్తుకొట్టైకి చెందిన ఈ జాలర్ల నుంచి దాదాపు ఏడు బోట్లు స్వాధీనం చేసుకున్నారు. మత్స్యకారులు చేపలు పడుతుండగా.. అక్కడికి వచ్చిన నేవీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారని మత్స్యశాఖ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. శ్రీలంక అధికారులు అదుపులోకి తీసుకున్నవారిలో 27 మంది రామేశ్వరానికి చెందినవారు కాగా.. మిగతావారంతా పుత్తుకొట్టైకి చెందినవారిగా గుర్తించారు. వీరందరినీ మంగళవారం శ్రీలంకలోని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని