వ్యవసాయ బిల్లులకు లోక్‌సభ ఆమోదం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుల్లో రెండింటికి లోక్‌సభ ఆమోదం తెలిపింది. రైతులు తమ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లోనే విక్రయించాలన్న నిబంధనను తొలగిస్తూ..........

Published : 17 Sep 2020 22:40 IST

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుల్లో రెండింటికి లోక్‌సభ ఆమోదం తెలిపింది. రైతులు తమ ఉత్పత్తులను వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లోనే విక్రయించాలన్న నిబంధనను తొలగిస్తూ తీసుకొచ్చిన ‘ద ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌) బిల్లు-2020తో పాటు పంట వేయడానికి ముందే వ్యవసాయ ఉత్పత్తుల విక్రయంపై వ్యాపారులతో రైతులు చేసుకొనే ఒప్పందాలకు రక్షణ కల్పించే ‘ద ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్‌ ఫామ్‌ సర్వీసెస్‌ బిల్లుకు ఆమోద ముద్ర వేసింది.

మరోవైపు, కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లులను ఎన్డీయే మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. చర్చ సందర్భంలో అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌ ఇది రైతులను నష్టంచేసేదిగా ఉందని విమర్శించారు. అనంతరం ఆ పార్టీ నుంచి కేంద్ర కేబినెట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌, డీఎంకే, ఆర్‌ఎస్‌పీ సభ్యులు సభనుంచి వాకౌట్‌ చేశారు. నిత్యావసర వస్తువుల (చట్టసరవణ) బిల్లును మంగళవారమే లోక్‌సభ ఆమోదించింది. గతంలో కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన ఆర్డినెన్స్‌లను బిల్లుల రూపంలో తీసుకురాగా.. లోక్‌సభలో గురువారం చర్చ జరిగింది. అనంతరం బిల్లులకు మూజువాణి ఓటుతో ఆమోదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని