ఆ రాష్ట్రంలో 20వేల మంది పోలీసులకు కరోనా!

కరోనా వైరస్‌ విజృంభన ధాటికి మహారాష్ట్ర వణికిపోతోంది. ముఖ్యంగా కరోనా వైరస్‌ పోరులో ముందున్న పోలీసుల సంఖ్య సైతం ఆందోళన కలగజేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ దాదాపు 20వేల మందికి పైగా పోలీసులు కరోనా వైరస్‌ బారిన పడినట్లు అధికారులు గురువారం వెల్లడించారు.

Published : 18 Sep 2020 02:14 IST

ముంబయి: కరోనా వైరస్‌ విజృంభణ ధాటికి మహారాష్ట్ర వణికిపోతోంది. ముఖ్యంగా కరోనా వైరస్‌ పోరులో ముందున్న పోలీసుల సంఖ్య సైతం ఆందోళన కలగజేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకూ దాదాపు 20వేల మందికి పైగా పోలీసులు కరోనా వైరస్‌ బారిన పడినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 364 మంది పోలీసులు కరోనా వైరస్‌ బారిన పడగా.. మరో నలుగురు మహమ్మారి కారణంగా ప్రాణాలు వదిలినట్లు తెలిపారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 20వేల మందికి పైగా పోలీసులు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వారిలో 2వేలకు పైగా అధికారులే. వైరస్‌ సోకిన వారిలో 208 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలోనూ 21 మంది ఉన్నత స్థాయి అధికారులు ఉన్నారు. ప్రస్తుతానికి మొత్తం 3వేలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 16వేల మందికి పైగా పోలీసులు కరోనా బారి నుంచి కోలుకున్నారు’అని అధికారులు వెల్లడించారు.  

మహారాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌-19 నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలకు సంబంధించి పోలీసులు 2లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దాదాపు 34వేల మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన విషయంలో పోలీసులు రూ.25 కోట్లు జరిమానా వసూలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 11లక్షల కరోనా కేసులు నమోదు కాగా.. 30వేల మంది మరణించారు. దాదాపు 7లక్షలకు పైగా కొవిడ్‌ నుంచి తిరిగి కోలుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని