మహారాష్ట్రలో కరోనా విలయతాండవం

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజు రికార్డు స్థాయిలో..

Published : 06 Sep 2020 23:15 IST

ఒక్క నెలలోనే 4 నుంచి 8 లక్షలకు చేరుకున్న కేసులు

ముంబయి: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ఆగస్టు నెలలోనే 3.70 లక్షల కేసులు నమోదయ్యాయి. గత నెలలో 3,76,587 కేసులు నమోదయినట్లు అధికారులు పేర్కొన్నారు. నెల ప్రారంభంలో 4 లక్షల కేసులు ఉండగా, నెల గడిచే నాటికి 8 లక్షలు దాటింది. ఆగస్టు 1న మొత్తం కేసులు 4,31,719 ఉండగా, సెప్టెంబర్‌ 1 నాటికి కేసుల సంఖ్య 8,08,306కు చేరినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. టెస్టుల సంఖ్య పెరగడం కూడా కేసులు ఎక్కువగా నమోదవడానికి కారణమని స్పష్టం చేశారు. గత నెలలో 20 లక్షల పరీక్షలు చేసినట్లు తెలిపారు. మహారాష్ట్రలో శనివారం రికార్డుస్థాయిలో 20,489 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో ప్రస్తుతం కేసుల సంఖ్య 8,83,862కు చేరింది. వ్యాధి సోకి ఇప్పటివరకు 26,276 మంది మృతిచెందారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని