రాష్ట్రపతి, ప్రధాని వినాయక చవితి శుభాకాంక్షలు

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు..

Published : 22 Aug 2020 11:45 IST

దిల్లీ: దేశ ప్రజలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కరోనాను దూరం చేయాలని కోరుకుంటున్నట్లు రాష్ట్రపతి భవన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఆ గణనాథుడు దీవెనలు దేశ ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. ‘గణేష్ చతుర్థి సందర్భంగా మీ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలి. భగవంతుడు మీకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలి’ అని ట్వీట్‌ చేశారు. పర్వదినాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ట్వీట్ చేశారు. దేశ ప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని