15 గంటలపాటు భారత్‌-చైనా చర్చలు!

వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద నుంచి బలగాలను వెనక్కి మళ్లించే విషయమై భారత్‌-చైనా సైన్యాల లెఫ్టినెంట్‌ జనరల్‌ల మధ్య నిన్న జరిగన చర్చలు 15గంటలపాటు కొనసాగాయి. నిన్న ఉదయం 11గంటలకు ప్రారంభమైన చర్చలు అర్ధరాత్రి 2గంటలకు ముగిసినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. గల్వాన్‌ లోయ ఉద్రిక్తతల అనంతరం ఇంతటి సుదీర్ఘ సమయం చర్చలు జరగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు నాలుగుసార్లు కమాండర్‌ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరిగాయి.

Updated : 15 Jul 2020 11:41 IST

లద్దాఖ్‌: వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వద్ద నుంచి బలగాలను వెనక్కి మళ్లించే విషయమై భారత్‌-చైనా సైన్యాల లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి అధికారుల మధ్య నిన్న 15గంటలపాటు చర్చలు జరిగాయి.  మంగళవారం ఉదయం 11గంటలకు ప్రారంభమైన చర్చలు బుధవారం తెల్లవారుజామున 2గంటలకు ముగిసినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. గల్వాన్‌ లోయ ఉద్రిక్తతల అనంతరం ఇంతటి సుదీర్ఘ సమయం భేటీ జరగడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు నాలుగుసార్లు కమాండర్‌ స్థాయి అధికారుల మధ్య చర్చలు జరిగాయి.

తూర్పు లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ వెంబడి భారత భూభాగం వైపున ఉన్న చుషూల్‌లో ఈ చర్చలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, వీటి పూర్తి సారాంశం బయటకు వెల్లడికానప్పటికీ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చల్లార్చడం, బలగాల ఉపసంహరణ తదితర అంశాలపై విధివిధానాలను ఖరారు చేయడమే లక్ష్యంగా జరిగినట్లు భారత ప్రభుత్వవర్గాలు తెలిపాయి. చైనా సైన్యం ఇప్పటికే గోగ్రా, హాట్‌ స్ప్రింగ్స్‌, గల్వాన్‌లోయ నుంచి వెనక్కి మళ్లింది. ఫింగర్‌-4, పాంగాంగ్‌ సరస్సుల వద్ద సైనికుల సంఖ్యను తగ్గించింది. వీటితోపాటు లద్దాఖ్‌లోని డెప్సాంగ్‌ మైదాన ప్రాంతం వద్ద పరిస్థితిని కూడా ఇరు దేశాల సైనికాధికారులు చర్చించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని