నన్ను మళ్లీ నిర్బంధించారు: మెహబూబా ముఫ్తీ

అధికారులు తనను మళ్లీ నిర్బంధించారని జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మంగళవారం ఆరోపించారు....

Published : 08 Dec 2020 17:24 IST

శ్రీనగర్‌: అధికారులు తనను మళ్లీ నిర్బంధించారని జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మంగళవారం ఆరోపించారు. తాను బయటకు వెళ్లకుండా తన ఇంటి గేట్లను మూసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు వెళ్లాలి గేట్లు తెరవండంటూ మెహబూబా ముఫ్తీ గేటును కొడుతున్న దృశ్యాలు ఆమె పోస్టు చేసిన వీడియోలో కనిపిస్తున్నాయి. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నవారిని అక్రమంగా నిర్బంధించడమే లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. బుడ్గామ్‌లో వందలాది మందిని వారి ఇళ్లలోనుంచి వెళ్లగొడుతున్నారు. వారి వద్దకు వెళుతున్నాననే నన్ను నిర్బంధించారు. ప్రభుత్వ లోపాలను ప్రశ్నించకూడదనే జమ్మూ కశ్మీర్‌ ప్రజలను కేంద్ర ప్రభుత్వం అణచివేస్తోంది’ అంటూ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌కు ఓ వీడియోను కూడా జతచేశారు. అధికారులు తనను నిర్బంధించారని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. అయితే ఆ గేట్‌కు లోపలినుంచే తాళం వేసి ఉంటడం గమనార్హం.

జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ గతేడాది ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగకుండా మెహబూబా ముఫ్తీతోపాటు అనేక మంది నేతలను గృహ నిర్బంధం చేశారు. 14 నెలల తర్వాత అక్టోబర్‌ 13న మాజీ ముఖ్యమంత్రికి విముక్తి కలిగించారు.

ఇవీ చదవండి...

‘ప్రభుత్వాన్ని మోకాళ్లమీద నిల్చోబెట్టింది’

గృహ నిర్బంధంలో కేజ్రీవాల్‌: ఆప్‌

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని