ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి యుద్ధ విమానం!

ఓఎల్‌ఎక్స్‌లో జరుగుతున్న మోసాలకు అంతులేకుండాపోతోంది. ఇప్పటి వరకు ఇందులో మొబైల్ ఫోన్లు, బైకులు, కార్లు, గృహోపకరణాలను మాత్రమే అమ్మకానికి ఉంచేవారు. తాజాగా ఓ ప్రబుద్ధుడు ఏకంగా యుద్ధ విమానాన్నే ఇందులో అమ్మకానికి పెట్టాడు. ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన.......

Published : 05 Aug 2020 09:30 IST

ప్రతీకాత్మక చిత్రం

లఖ్‌నవూ: ఓఎల్‌ఎక్స్‌లో ఇప్పటి వరకు మొబైల్ ఫోన్లు, బైకులు, కార్లు, గృహోపకరణాలను మాత్రమే అమ్మకానికి ఉంచేవారు. తాజాగా ఓ ప్రబుద్ధుడు ఏకంగా యుద్ధ విమానాన్నే ఇందులో అమ్మకానికి పెట్టాడు. ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన మిగ్‌-23 యుద్ధ విమానాన్ని ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీకి 2009లో ఐఏఎఫ్ బహుమతిగా ఇచ్చింది. దీనిని యూనివర్శిటీ ఆవరణలోని ఇంజనీరింగ్ కళాశాల ముందు భాగంలో ప్రదర్శనకు ఉంచారు. అయితే ఎవరో ఆకతాయి రూ.9.99 కోట్లకు ఈ యుద్ధ  విమానాన్ని ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి ఉంచారు.

ఈ ఘటనపై యూనివర్శిటీ అధికార ప్రతినిధి వసీమ్‌ అలీ స్పందిస్తూ..  కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న తర్వాత ఈ యుద్ధ విమానాన్ని ఇంజనీరింగ్ విద్యార్థుల పరిశోధనల కోసం యూనివర్శిటీకి ఐఏఎఫ్ బహుమతిగా ఇచ్చిందని తెలిపారు. ఇంతటి చరిత్ర కలిగిన విమానం అమ్మకాని ఉంచడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. యూనివర్సిటీ ప్రతిష్ఠ దెబ్బతీయడానికే ఎవరో ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వసీమ్‌ అలీ తెలిపారు. ప్రస్తుతం ఓఎల్‌ఎక్స్‌లోంచి సదరు చిత్రాన్ని తొలగించినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని