
అలా చేస్తే విడాకులిస్తుంది.. ఒబామా
ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు నచ్చని పని చేస్తే తన భార్య, మాజీ ప్రథమ మహిళ మిషెల్లె ఒబామా తనకు విడాకులు ఇస్తారని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చమత్కరించారు. తన స్వీయ రచన ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకావిష్కరణ రెండురోజుల్లో జరగనున్న సందర్భంగా ఓ ముఖాముఖిలో తన అభిప్రాయాలను వెల్లడించారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న 2009 నుంచి 2017 మధ్య కాలంలో.. జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిదే. కాగా తాజా ఎన్నికల్లో గెలిచిన బైడెన్ జనవరి 2021లో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అవకాశం వస్తే ఆయన క్యాబినెట్లో సభ్యులౌతారా అనే ప్రశ్నకు.. ఒబామా ‘నో’ అని సమాధానమిచ్చారు. అలా చేస్తే తన భార్య మిషెల్లె తనను వదిలేస్తుందని ఆయన సరదాగా అన్నారు.
అసలు 2008 అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీచేయటమే మిషెల్లెకు ఇష్టం లేదని ఒబామా ఈ సందర్భంగా వెల్లడించారు. అధ్యక్ష బాధ్యతలు కుటుంబ జీవితంపై ప్రభావం చూపుతాయనేది నిజమేనని ఆయన అంగీకరించారు. ఆమెకు ఇష్టంలేకపోయినా తాను అధ్యక్షుడి బాధ్యతలను సక్రమంగా నిర్వహించేందుకు సహకరించిన తన భార్య మిషెల్లేకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.