బర్గర్‌ కోసం.. 450మైళ్లు.. ₹2లక్షల ఖర్చు!

రష్యాకు చెందిన మిలియనీర్‌ తన స్నేహితురాలితో కలిసి క్రిమియాకు విహార యాత్రకు వెళ్లారు. వెళ్లింది హాయిగా గడపడానికే అయినా, నచ్చిన ఆహారం దొరకపోవడంతో అసంతృప్తి గురయ్యాడు.

Updated : 06 Dec 2020 16:26 IST

మాస్కో: రష్యాకు చెందిన మిలియనీర్‌ తన స్నేహితురాలితో కలిసి క్రిమియాకు విహార యాత్రకు వెళ్లారు. వెళ్లింది హాయిగా గడపడానికే అయినా, నచ్చిన ఆహారం దొరకపోవడంతో అసంతృప్తికి గురయ్యాడు. దాంతో రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బర్గర్ తినేందుకు 450 మైళ్లు ప్రయాణించాడు. ఇంతకీ విషయం ఏంటంటే..

33 ఏళ్ల విక్టోర్ మార్టినోవ్ అనే మిలియనీర్‌ తన స్నేహితురాలితో కలిసి క్రిమియాలోని అలుస్తాకు విహార యాత్రకు వెళ్లారు. అయితే అక్కడ దొరికే ఆహారం ఆయన నోటికి రుచించలేదు. అక్కడ నుంచి దగ్గర్లోని మెక్‌డొనాల్డ్ అవుట్‌లెట్‌కు వెళ్లాలంటే 450 మైళ్లు ప్రయాణించాల్సి ఉంటుంది. డబ్బు కంటే అనుకున్నప్పుడు నచ్చిన వంటకం రుచి చూడడమే ముఖ్యమనుకొని, అప్పటికప్పుడు ఒక హెలికాఫ్టర్‌ను బుక్ చేసుకున్నారు. తమకు నచ్చినట్లుగా 49 పౌండ్లు(సుమారు రూ.5,000) విలువైన వంటకాలు రుచి చూసి తిరిగి వచ్చేశారు. ఈ ప్రయాణానికి వారికి అయిన ఖర్చు 2,000 పౌండ్లు( అంటే అక్షరాలా రూ. రెండు లక్షలు). దీనికి సంబంధించిన రికార్డింగ్‌ను మార్టినోవ్‌ నెట్టింట్లో షేర్ చేయగా నెటిజన్లు నోరెళ్లబెట్టారు. ‘నేను, నా స్నేహితురాలు ఆర్గానిక్ ఫుడ్‌తో విసిగిపోయాం. అందుకే మేం మాకు నచ్చిన ఆహారం తినడం కోసం హెలికాఫ్టర్‌ను బుక్ చేసుకున్నాం. ఈ ప్రయాణం మాకు గుర్తుండిపోయే సాహసంగా మిగిలింది. మేం అక్కడ బర్గర్లు తిని, తిరిగొచ్చేశాం’ అని వివరించారు. 2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకున్న దగ్గరి నుంచి మెక్‌డొనాల్డ్స్‌ అక్కడ తన సేవలను నిలిపివేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని