కరోనా తర్వాత వారు పాఠశాలకు వెళ్లడం కష్టమే!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ నిబంధనలు ఎత్తివేసిన తరవాత కూడా విద్యార్థినులు తిరిగి పాఠశాల బాట పట్టరని యునెస్కో హెడ్ ఆడ్రే ఆజౌలే ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 16 Oct 2020 20:04 IST

యునెస్కో ఆందోళన

కిన్షాసా(డీఆర్ కాంగో): ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ నిబంధనలు ఎత్తివేసిన తర్వాత కూడా విద్యార్థినులు తిరిగి పాఠశాల బాట పట్టరని యునెస్కో హెడ్ ఆడ్రే ఆజౌలే ఆందోళన వ్యక్తం చేశారు. డెమోక్రటిక్ రిపబ్లిక్‌ ఆఫ్ కాంగో పర్యటనలో భాగంగా అక్కడి పాఠశాల సందర్శన అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

‘చాలా దేశాలు పాఠశాలలను మూసివేయడం నష్టాలకు దారితీసిందని మేం ఆందోళన చెందుతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా 11 మిలియన్ల (1.1కోట్లు)మంది పాఠశాలలకు వెళ్లలేరని మేం అంచనా వేస్తున్నాం. పాఠశాలకు వెళ్లాల్సిన అవసరంపై మేం అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించాం. దురదృష్టవశాత్తూ బాలికలకు విద్య అసమానంగా అందుతోంది’ అని ఆజౌలే ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని