Published : 13 Dec 2020 01:49 IST

రైతుల్ని అలా పోల్చడం బాధాకరం: బాదల్‌

అమృత్‌సర్‌: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతుల్ని ‘ఖలిస్థానీ’, ‘దేశద్రోహుల’తో పోల్చడం దురదృష్టకరమని శిరోమణి అకాలీదళ్‌ అధినేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ అన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన మంత్రులు వెంటనే బహిరంగంగా రైతులకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన అమృత్‌సర్‌లో నిర్వహించిన విలేకరులతో మాట్లాడారు. 

‘రైతుల్ని ఖలీస్థానీలతో పోల్చి కేంద్రం వారి నిరసనల్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది. కేంద్రంలో ఉన్నవారు తమ విధానాలకు లోబడి ఉండని వారిని దేశద్రోహులుగా పిలవడం ఎంతో దురదృష్టకరమైన విషయం. రైతుల్ని ఆ విధంగా పిలిచిన మంత్రులు తప్పక బహిరంగ క్షమాపణలు చెప్పాలి. కేంద్రంలో ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఆ రకమైన వ్యాఖ్యలు చేయడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్రం రైతుల గొంతును వినకుండా అణచివేసే ప్రయత్నం చేయడం కూడా దురదృష్టకరం. రైతులు కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల్ని కోరుకోవడం లేదు. అయినప్పటికీ వాటి విషయంలో కేంద్రం ఎందుకు దౌర్జన్యంగా వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదు’ అని బాదల్‌ విమర్శించారు.

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దిల్లీ సరిహద్దుల్లో 17రోజులుగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ నెల 19వ తేదీ లోపు8 తమ డిమాండ్లపై కేంద్రం అంగీకారానికి రాకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని రైతులు హెచ్చరించారు. కొత్త చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. 

ఇదీ చదవండి

మమ్మల్ని విడగొట్టేందుకు కేంద్రం యత్నం: రైతులు

కరోనా టీకా తీసుకున్నాక ఎలా ఉంటుందంటే?

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని