8 నెలలుగా తప్పిపోయి.. సరిహద్దుల్లో శవమై..

8 నెలలుగా తప్పిపోయిన ఓ జవాను సరిహద్దుల్లోని మంచులో శవమై తేలాడు. ఈ ఏడాది జనవరిలో సైన్యంలోనుంచి..

Published : 17 Aug 2020 01:30 IST

మంచులో కూరుకుపోయి లభ్యమైన జవాను మృతదేహం

దెహ్రాదున్‌:  8 నెలలుగా తప్పిపోయిన ఓ జవాను సరిహద్దు ప్రాంతంలో మంచులో శవమై కనిపించాడు. ఈ ఏడాది జనవరిలో తప్పిపోయిన హవల్దార్‌ రాజేంద్రసింగ్‌ నేగి (36) మృతదేహాన్ని కశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వద్ద శనివారం గుర్తించారు. 11వ గర్‌వాలీ రైఫిల్స్‌కు చెందిన భారత జవాను కశ్మీర్‌లోని గుల్‌మర్గ్‌ ప్రాంతంలోని ఎల్‌ఓసీ వద్ద జనవరిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తూ మంచు కొండల్లోకి  జారి పడ్డాడు. అయితే అతడి మృతదేహాన్ని కనుగొనడం సైన్యానికి కష్టమైంది. దీంతో జూన్‌లో నేగీని అమరవీరుడిగా ప్రకటించారు. అనంతరం జూన్‌ 21న ఈ విషయాన్ని దెహ్రాదూన్‌లోని బాధితుడి కుటుంబానికి ఓ లేఖ ద్వారా తెలియజేసింది. అయితే నేగీ అమరుడయ్యాడన్న విషయాన్ని అతడి భార్య రాజేశ్వరి దేవి ఖండించింది. తన కళ్లతో మృతదేహాన్ని చూసే వరకు మరణించాడనే వార్తను అంగీకరించనని తేల్చి చెప్పింది.

శనివారం మృతదేహం లభించినట్లు భారత సైన్యం నేగీ కుటుంబానికి వెల్లడించింది. ప్రస్తుతం మృతదేహాన్ని శ్రీనగర్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో ఉంచినట్లు, వైద్య సంబంధిత ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు సైన్యాధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని