రైతుల సంక్షేమమే ధ్యేయం: స్మృతి ఇరానీ

మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. స్వామినాథన్‌ నివేదికను గుర్తు చేస్తూ అందులో పేర్కొన్న విధంగా మోదీ ప్రభుత్వం 1.5 శాతం రెట్టంపుతో రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తుందని చెప్పారు.

Published : 23 Sep 2020 23:30 IST

దిల్లీ: మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. స్వామినాథన్‌ సిఫార్సులను గుర్తు చేస్తూ అందులో పేర్కొన్న విధంగా మోదీ ప్రభుత్వం 1.5 శాతం రెట్టింపుతో రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తుందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయలేదన్నారు. కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద దాదాపు 10 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చినట్లు చెప్పారు. రూ.90వేల కోట్లకు పైగా ధనాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేశామన్నారు. రైతులు తమ ఉత్పత్తుల్ని స్వేచ్ఛగా ఎక్కడైనా అమ్ముకునేందుకు వ్యవసాయ సంబంధిత బిల్లులను తీసుకొచ్చామని, అలాంటి బిల్లుల్ని కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించడం తగదని ఆమె విమర్శించారు. 

ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ సంబంధిత బిల్లుల్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. ఆ బిల్లులపై సంతకం చేయొద్దని ఆయనను కోరారు. మరోవైపు గురువారం నుంచి దేశవ్యాప్త నిరసనలు చేపట్టేందుకు ఆ పార్టీ నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని