మోదీ షేర్‌ చేసిన అద్భుత దృశ్యం: వీడియో వైరల్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నచ్చిన అపురూప దృశ్యానికి సంబంధించిన వీడియో ఒక దానిని పంచుకున్నారు.

Updated : 26 Aug 2020 11:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు నచ్చిన అపురూప దృశ్యానికి సంబంధించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘‘వర్షం పడిన రోజు అద్భుతంగా కనిపించే మోధేరా సూర్య దేవాలయం! ఒకసారి చూడండి..’’ అనే వ్యాఖ్యను దానికి జతచేశారు. ఆ చారిత్రక స్థల అపురూప సౌందర్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపే ఈ వీడియోలో.. వర్షపు నీరు దేవాలయం మెట్ల గుండా ప్రవహిస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. కాగా, ఈ వీడియో కేవలం మూడు గంటల్లో 5.8 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకోవటం విశేషం.

కాగా, ఈ ప్రదేశం గుజరాత్‌లోని మెహ్‌సనా జిల్లా, మోధేరా గ్రామంలో పుష్పావతి నది ఒడ్డున ఉంది. ఆ ప్రాంతాన్ని పాలించిన చాళుక్య వంశ రాజులు దీనిని 11వ శతాబ్దంలో నిర్మించారు. అనంతరం శిథిలావస్థకు చేరుకున్న ఈ దేవాలయంలో ప్రస్తుతం పూజలు నిర్వహించడం లేదు. దీనిని ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా జాతీయ ప్రాముఖ్యత గల కట్టడంగా గుర్తించి పరిరక్షిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని