Published : 08/12/2020 13:02 IST

మోదీజీ.. రైతులను దోచుకోవడం ఆపండి

రాహుల్‌గాంధీ విమర్శలు

దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అన్నదాతలు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌కు కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆ పార్టీ నేతలు రోడ్లపైకి చేరి రైతుల ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఘాటు విమర్శలు చేశారు. రైతుల నుంచి దోచుకోవడం మాని.. వారికి మద్దతివ్వాలంటూ ప్రధానిని దుయ్యబట్టారు. 

రైతులకు మద్దతుగా ట్విటర్‌ వేదికగా స్పందించిన రాహుల్‌గాంధీ.. ‘మోదీజీ.. రైతుల నుంచి దోచుకోవడం ఆపండి. ఈ రోజు భారత్‌బంద్‌ అని దేశ ప్రజలందరికీ తెలుసు. ఈ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించి మన అన్నదాతల ఆందోళనను విజయవంతం చేయండి’ అని అన్నారు. రైతుల ఆందోళనకు ముందు నుంచీ తన మద్దతు తెలుపుతున్న రాహుల్‌.. ఇప్పటికే పలు సార్లు కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు. కొద్ది నెలల కిందట వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌-హరియాణా రాష్ట్రాల్లో రాహుల్‌ ఖేతి బచావో యాత్ర చేపట్టారు. ఈ చట్టాలను మోదీ కేవలం తన మిత్రుల కోసం తీసుకొచ్చినవే అని, వీటివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. రైతులకు మద్దతుగా ఈ ఏడాది తన పుట్టినరోజు వేడులకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయించుకున్నారు. 

ఇవీ చదవండి..

గృహనిర్బంధంలో కేజ్రీవాల్‌: ఆప్‌

రైతులకు అమెరికా నేతల మద్దతు!

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్