ముంబయి సురక్షితం కాదు: అమృత ఫడణవీస్!

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య కేసు విచారణపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే బిహార్‌ పోలీసులను మహారాష్ట్రలోకి అనుమతించడంలేదనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సుశాంత్‌ సింగ్‌ మృతి కేసుపై ముంబయి పోలీసులు సరిగా దర్యాప్తు జరపడంలేదనే విమర్శలు ఎక్కువయ్యాయి.

Published : 04 Aug 2020 12:08 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్య కేసు విచారణపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే బిహార్‌ పోలీసులను మహారాష్ట్రలోకి అనుమతించడంలేదనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సుశాంత్‌ సింగ్‌ మృతి కేసుపై ముంబయి పోలీసులు సరైన రీతిలో దర్యాప్తు జరపడంలేదనే విమర్శలు ఎక్కువయ్యాయి. తాజాగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ భార్య అమృత ఫడణవీస్‌ ముంబయి పోలీసుల తీరుపై మండిపడ్డారు. ‘ముంబయి తన మానవత్వాన్ని కోల్పోయింది. నగర పోలీసులు సుశాంత్‌ సింగ్‌ కేసును దర్యాప్తు చేస్తున్న తీరును చూస్తుంటే అమాయకులు, ఆత్మాభిమానం ఉన్నవారికి ఇక్కడ నివసించడం సురక్షితం కాదని అర్థమవుతోంది’ అని అమృత ట్విటర్‌లో పేర్కొన్నారు. అంతకుముందు, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ కూడా ముంబయి పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. బిహార్ పోలీసులను మహారాష్ట్రలోకి అనుమతించకపోవడం వింతగా ఉందన్నారు. ఇది మహారాష్ట్ర ప్రభుత్వంపై అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడ్డారు.

అమృత ట్వీట్‌పై శివసేన, ఎన్‌సీపీ పార్టీలు స్పందించాయి. మీకు రక్షణగా ఉంటున్న పోలీసుల తీరుపైనే విమర్శలు చేయడం వారిని అవమానించడమేనని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ అన్నారు. ఇలాంటి సమయంలో ప్రస్తుతం మీకున్న పోలీసులను వెనక్కి పంపించి ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకోవాలని అమృతకు సవాల్‌ విసిరారు. మాజీ ముఖ్యమంత్రి భార్యగా అమృత ఈవ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎన్‌సీపీ నేతలు కూడా అమృత తీరుపై విమర్శలు చేస్తున్నారు.

ఇవీ చదవండి..
నొప్పిలేకుండా చావు: గూగుల్‌లో వెతికిన సుశాంత్‌
సుశాంత్‌కు అపాయం ఉందంటే పట్టించుకోలేదట!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని