బాలిక హత్యోదంతంపై సిట్‌: నవీన్‌ పట్నాయక్‌

ఒడిశాలోని నయాగఢ్‌ జిల్లాలో ఐదేళ్ల బాలిక కిడ్నాప్‌, హత్యోదంతంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ శుక్రవారం వెల్లడించారు........

Published : 27 Nov 2020 23:31 IST

 

భువనేశ్వర్‌: ఒడిశాలోని నయాగఢ్‌ జిల్లాలో ఐదేళ్ల బాలిక కిడ్నాప్‌, హత్యోదంతంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ శుక్రవారం వెల్లడించారు. ఒడిశా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘నయాగఢ్‌ ఘటన చాలా బాధించింది. ప్రభుత్వం ఎప్పటికీ చట్ట ప్రకారమే నడుచుకుంటుంది. ఈ కేసులో ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా ప్రభుత్వం దర్యాప్తు బృందానికి అన్ని విధాలా సహకరిస్తుంది’ అన్నారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. నయాగఢ్‌‌ జిల్లాలో ఐదేళ్ల బాలికను దుండగులు జులై 4న కిడ్నాప్‌ చేసి హత్య చేశారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించాలని అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీంతో అడిషనల్‌ డైరెక్ట్‌ జనరల్‌ యశ్వంత్‌ జెత్వా బేగన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని