హబుల్ 30వ జన్మదినం..నాసా ట్వీట్‌

శాస్త్రవేత్తలు విశ్వం గురించి చేసే అధ్యయనంలో హబుల్ టెలిస్కోప్‌ కీలక పాత్ర పోషించింది.

Published : 13 Dec 2020 00:50 IST

వాషింగ్టన్‌: శాస్త్రవేత్తలు విశ్వం గురించి చేసే అధ్యయనంలో హబుల్ టెలిస్కోప్‌ కీలక పాత్ర పోషించింది. ఆకర్షణీయమైన, అద్భుతమైన చిత్రాలను తీసి, పరిశోధకులు విశ్వం గురించి లోతుగా అర్థం చేసుకునేందుకు దోహదం చేసింది. శాస్త్రవేత్తలకు ఇంతగా సహకరించే ఈ హబుల్ టెలిస్కోప్‌ను అమెరికన్ స్పేస్‌ సంస్థ నాసా 1990లో లాంచ్ చేసింది. దాన్ని ప్రయోగించి 30 సంవత్సరాలు పూర్తి కావొస్తున్న తరుణంలో హబుల్ టెలిస్కోప్‌ తీసిన చిత్రాల సమాహారంగా ఉన్న ఒక వీడియోను నాసా ట్విటర్‌లో పంచుకుంది. ‘హబుల్ 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. మీతో పంచుకోవడానికి పుట్టినరోజు బహుమతి ఉంది. కాల్డ్‌వెల్‌  కేటలాగ్‌లోని 30 ఖగోళ వస్తువుల హబుల్ చిత్రాలు..విశ్వంలోని దృశ్యాలను మీ ముందు ఆవిష్కరిస్తాయి’ అని నాసా వీడియోతో పాటు వ్యాఖ్యను జోడించింది. 109 స్టార్ క్లస్టర్లు, నెబ్యులా, గెలాక్సీలతో కూడిన ఖగోళ జాబితానే కాల్డ్‌వెల్ కేటలాగ్.

ఇవీ చదవండి:

అంతరిక్షంలో ముల్లంగి సాగు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని