హాథ్రస్‌ ఘటనపై వివరణ ఇవ్వండి...

హాథ్రాస్‌ బాధితురాలిపై చోటుచేసుకున్న సామూహిక అత్యాచారం, దారుణ హింసను జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది.

Published : 01 Oct 2020 10:41 IST

యూపీ ప్రభుత్వం, పోలీసు శాఖకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు

దిల్లీ: హాథ్రస్‌‌ ఘటనను జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హాథ్రస్‌ జిల్లాలో జరిగిన ఈ ఘోర సంఘటనలో 19 ఏళ్ల ఓ దళిత యువతిని.. నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, తీవ్రంగా హింసించారు. ఈ ఘటనలో గాయపడిన ఆమె చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సంఘటనను సుమోటో కేసుగా స్వీకరించినట్టు ఎన్‌హెచ్ఆర్సీ ప్రకటించింది. ఈ విషయమై వివరణ కోరుతూ ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం, ఆ రాష్ట్ర డీజీపీ‌కు నోటీసులు జారీచేసింది.

సెప్టెంబర్‌ 14న తన తల్లితో కలసి పొలానికి వెళ్లిన యువతి.. అనంతరం కనిపించకుండా పోయింది. తీవ్రంగా గాయపడిన స్థితిలో ఆమెను సెప్టెంబర్‌ 22న కనుగొన్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం తొలుత అలీఘడ్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌లో చేర్చారు. అనంతరం మెరుగైన వైద్య కోసం సోమవారం దిల్లీలోని సఫ్దర్‌ జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మంగళవారం కన్నుమూసింది. బుధవారం అర్ధరాత్రి యువతి మృతదేహాన్ని ఉత్తర్‌ ప్రదేశ్‌కు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని