ఉగ్రవాదులకు నిధుల కేసులో దిల్లీలో సోదాలు

సామాజిక సేవా కార్యక్రమాల పేరుతో ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్న కేసులో జమ్మూ-కశ్మీర్‌లో నిన్న చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు గురువారం కూడా కొనసాగాయి. కశ్మీర్‌ లోయలోని 9 చోట్ల, దిల్లీలోని ఒక చోట అధికారులు సోదాలు.................

Updated : 29 Oct 2020 10:57 IST

శ్రీనగర్‌: సామాజిక సేవా కార్యక్రమాల పేరుతో ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్న కేసులో జమ్మూ-కశ్మీర్‌లో నిన్న చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) సోదాలు గురువారం కూడా కొనసాగాయి. కశ్మీర్‌ లోయలోని 9 చోట్ల, దిల్లీలోని ఒక చోట అధికారులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నేరపూరితమైన పలు దస్త్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ ఓ ప్రకటనలో తెలిపింది. దిల్లీలోని ఛారిటీ అలియన్స్‌, హ్యూమన్‌ వెల్ఫేర్‌ ఫౌండేషన్‌, శ్రీనగర్‌లోని ఫలా ఇ ఆమ్‌ ట్రస్ట్‌, జేకే యతీమ్‌ ఫౌండేషన్‌, సాల్వేషన్‌ మూమెంట్‌, జేకే వాయిస్‌ ఆఫ్‌ విక్టిమ్స్‌ ఎన్జీవో కార్యాలయాల్లో ఈ సోదాలు జరిగినట్లు తెలిపింది.

బుధవారం శ్రీనగర్‌, బండిపొరాల్లోని 10 చోట్ల, బెంగళూరులోని ఒక చోట ఎన్‌ఐఏ సోదాలు జరిపిన విషయం తెలిసిందే. పలు సేవా సంఘాలు, సామాజిక సంస్థలు దేశ విదేశాల నుంచి విరాళాలు సేకరించి.. ఆ నిధులను జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు సాయం అందించేందుకు ఉపయోగిస్తున్నాయనే సమాచారం మేరకు అక్టోబరు 8న ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే తాజా సోదాలు చేపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని