
Published : 31 Jul 2020 12:32 IST
కాంగ్రెస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీశ్ ధామీ వరద ప్రభావం నుంచి తృటిలో తప్పించుకున్నారు. పితోర్‌ఘడ్ జిల్లా ధారుచులా ప్రాంతంలో అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో కాలువను దాటేందుకు ఎమ్మెల్యే హరీశ్ ప్రయత్నించారు. ఈ క్రమంలో కాలువ చివరికి చేరే సరికి వరద ఉద్ధృతి మరింత పెరిగింది. దీంతో ఎమ్మెల్యే పట్టుతప్పి కాలువలో జారి పడిపోయారు. వరద నీటిలో కొట్టుకుపోతున్న ఆయన్ని అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు రక్షించారు.
Tags :