దేశవ్యాప్తంగా 7 రోజులు సంతాప దినాలు: కేంద్రం

మాజీ రాష్ట్రపతి, భరతమాత ముద్దుబిడ్డ ప్రణబ్‌ ముఖర్జీ మరణంతో దేశంలో విషాదం నెలకొంది.  ఆయనకు గౌరవార్థం దేశ వ్యాప్తంగా ఏడు రోజుల.........

Updated : 31 Aug 2020 19:54 IST

దిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణంతో దేశంలో విషాదం నెలకొంది. ఆయన అందించిన సేవలను స్మరించుకొనేందుకు దేశ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు, పార్లమెంట్‌, రాష్ట్రపతిభవన్‌ సహా అన్ని కార్యాలయాలపైనా జాతీయ జెండాను అవనతం చేశారు. ప్రణబ్‌కు అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలికేందుకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సైనిక గౌరవ వందనంతో వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఈ నెల 10న అనారోగ్యంతో దిల్లీలోని సైనిక ఆస్పత్రిలో చేరిన ప్రణబ్‌ ముఖర్జీకి వైద్యులు మెదడులో ఏర్పడిన కణితికి శస్త్ర చికిత్స చేసిన విషయం తెలిసిందే. శస్త్ర చికిత్సకు ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో తనకు పాజిటివ్‌గా తేలిందని ప్రణబ్‌ ముఖర్జీయే స్వయంగా తన ట్విటర్‌ ఖాతాలో వెల్లడించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో 21 రోజులుగా చికిత్సపొందుతున్న ఆయన.. సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని