74% క్రియాశీల కేసులు ఈ 9రాష్ట్రాల్లోనే!

భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 96,551 పాజిటివ్‌ కేసులు.............

Published : 11 Sep 2020 16:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 96,551 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. 70,880 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 9,43,480 క్రియాశీల కేసులు ఉన్నాయి. కొవిడ్‌ బారిన పడి చికిత్సపొందుతున్న వారిలో దాదాపు 74శాతం మంది తొమ్మిది రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం.

మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 48.8శాతం క్రియాశీల కేసులు ఉండగా.. ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, అసోం, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో మరో 25.1శాతం కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో పది రాష్ట్రాల్లో 21.9శాతం, 16 రాష్ట్రాల/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 4.2శాతంగా ఉన్నాయి. 

అలాగే, కొత్త కేసుల్లో 57శాతం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడులో నమోదు కాగా.. 60శాతం రికవరీ రేటు కూడా ఇవే రాష్ట్రాల్లో నమోదు కావడం గమనార్హం. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం ఉదయం 8గంటలకు విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 45,62,414గా ఉంది. వీటిలో 35,42,663 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 76,271మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 9,43,480 మంది చికిత్సపొందుతున్నారు. భారత్‌లో రికవరీ రేటు 77.6శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.7%,  క్రియాశీల కేసుల శాతం 20.7%గా ఉంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని