ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన జెసిండా 

న్యూజిలాండ్ ప్రధానిగా జెసిండా ఆర్డెర్న్‌ రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈసారి పూర్తి మెజారిటీ సాధించిన లేబర్‌ పార్టీ నేత శుక్రవారం న్యూజిలాండ్‌ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసి...

Updated : 06 Nov 2020 11:33 IST

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్ ప్రధానిగా జెసిండా ఆర్డెర్న్‌ రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఈసారి పూర్తి మెజారిటీ సాధించిన లేబర్‌ పార్టీ నేతగా ప్రధాని పదవిని అధిరోహించారు. వెల్లింగ్టన్‌ అధికార గృహంలో జరిగిన కార్యక్రమంలో జెసిండాతోపాటు ఇతర మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ‘విశిష్ట ప్రతిభ, అపారమైన అనుభవం కలగలిసిన నేతలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. దేశం ఎలాంటి సంక్షభంలోకి వెళ్లినా నిబద్ధతలో కలిసి పనిచేసేందుకు సన్నద్ధంగా ఉంటాం’ అని ఈ సందర్భంగా న్యూజిలాండ్‌ ప్రధాని పేర్కొన్నారు.

అక్టోబర్‌ 17న జరిగిన ఎన్నికల్లో జెసిండా ఆర్డెర్న్‌ నేతృత్వం వహిస్తున్న లేబర్‌ పార్టీ ఘన విజయం సొంతం చేసుకుంది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఇంతటి భారీ విజయం సాధించడం ఇదే మొదటిసారి. గతంలో ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్న పార్టీ ఈ ఘనవిజయంతో మొదటిసారి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని