కరోనా ఎఫెక్ట్‌: ఆ నగరంలో రాత్రి కర్ఫ్యూ

కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతుండటంతో అహ్మదాబాద్‌లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. నగరంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ ఉంటుంది.  ఈ నిరవధిక కర్ఫ్యూ  శుక్రవారం నుంచి అమలులోకి వస్తుంది.  బుధవారం నాటికి నగరంలో మొత్తం 46,022 కరోనా కేసులు నమోదయ్యాయి.

Published : 19 Nov 2020 22:16 IST

 

అహ్మదాబాద్‌: కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతుండటంతో అహ్మదాబాద్‌లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. నగరంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ ఉంటుంది. ఈ నిరవధిక కర్ఫ్యూ  శుక్రవారం నుంచి అమలులోకి వస్తుంది.  బుధవారం నాటికి నగరంలో మొత్తం 46,022 కరోనా కేసులు నమోదయ్యాయి.  పండగల వేళ కరోనా కేసులు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో కొత్తగా కరోనా బాధితులు పెరుగుతుండటంతో నగరంలోని ఆసుపత్రుల్లో వారికి సరిపడే పడకలు అందుబాటులో లేవు. ప్రస్తుతం 40 శాతం పడకలు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. అహ్మదాబాద్‌లో కొవిడ్‌-19 నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఆయనను నియమించారు. నగరంలో బుధవారం కొత్తగా 14 ప్రాంతాలు కలుపుకొని 100  మైక్రో కంటైన్‌మెంట్‌ ప్రాంతాలను గుర్తించినట్లు నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ శాఖ తెలిపింది.  కొత్తగా నిర్మించిన, స్వతంత్రంగా ఏర్పాటు చేసుకున్న ప్రాంతాలలో కరోనా కేసులు నమోదు కావడంతో అవి కూడా కంటైన్మెంట్‌ జాబితాలోకి చేరాయి.  గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా  కరోనా కేసులు 18 శాతం పెరిగాయి.  పండగల వేళ దిల్లీలో కరోనా కేసులు పెరిగాయి. దీంతో దేశ రాజధానిలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్‌ వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని