11కి చేరిన రాయ్‌గఢ్‌ మృతుల సంఖ్య

రాయ్‌గఢ్‌లో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కి చేరింది. పలువురి ఆచూకీ..

Updated : 25 Aug 2020 17:03 IST

లభించని పలువురి ఆచూకీ

ముంబయి: రాయ్‌గఢ్‌లో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కి చేరింది. శిథిలాల కింద చిక్కుకున్న పలువురి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లా కాజల్‌పురా ప్రాంతం మహద్‌ పట్టణంలో సోమవారం సాయంత్రం ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దాదాపు 75 మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోగా ఇప్పటివరకు 60 మందిని కాపాడారు. మిగతావారి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన మూడు బృందాలు, 12 అగ్ని మాపక శాఖ బృందాలు 22 గంటలుగా సహాయక చర్యలు చేపడుతున్నాయి. శిథిలాల కింద ఉన్నవారిని కనుగొనేందుకు జాగిలాల సహాయం తీసుకుంటున్నారు.

ఈ ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ‘మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలో జరిగిన దుర్ఘటన తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని