
Published : 22 Dec 2020 17:40 IST
సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ఇప్పుడే కాదు!
దిల్లీ: సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షల నిర్వహణ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి మాసాల్లో ఉండదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ వెల్లడించారు. ఈమేరకు ఆయన మంగళవారం ఉపాధ్యాయులతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పేర్కొన్నారు. ‘సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షల నిర్వహణ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఉండదు. కొంత కాలం తర్వాత పరీక్షల నిర్వహణ జరుగుతుంది’ అని పోఖ్రియాల్ తెలిపారు. కానీ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రత్యేకమైన తేదీలను వెల్లడించలేదు.
ఇదీ చదవండి
Tags :