అప్పటి వరకు కేంద్రంతో చర్చించేది లేదు

పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధిత బిల్లులను వెనక్కి తీసుకునే వరకు కేంద్రంతో చర్చించే ప్రసక్తే లేదని ఎన్డీయే కూటమి పార్టీ శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌...........

Published : 19 Sep 2020 23:58 IST

దిల్లీ: పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధిత బిల్లులను వెనక్కి తీసుకునే వరకు కేంద్రంతో చర్చించే ప్రసక్తే లేదని ఎన్డీయే కూటమి పార్టీ శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రైతులు ఇబ్బందుల పాలవుతారు. మా పార్టీ ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుంది. కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లులపై రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. కాబట్టి కేంద్రం పార్లమెంటు ప్రవేశపెట్టిన బిల్లులను వెనక్కి తీసుకోవాలి. అప్పటి వరకు కేంద్రంతో ఎలాంటి చర్చలూ జరిపేది లేదు’ అని బాదల్‌ అన్నారు. 

వ్యవసాయ వాణిజ్యానికి సంబంధించి కేంద్రం నాలుగు బిల్లులను ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అవి లోక్‌సభలో ఆమోదం పొందాయి. ఆ బిల్లులు అమలైతే రైతులు తమ ఉత్పత్తులను వాణిజ్యం చేసుకోవడంలో ఎంతో ఉపయోగపడతాయని కేంద్రం అంటోంది. కానీ అవి రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని విపక్షాలు, రైతు సంఘాలు చెబుతున్నాయి. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నేత హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని