ప్లాస్మా థెరపీతో ప్రయోజనం కనిపించలేదు: ఎయిమ్స్‌

కరోనా రోగులపై ప్లాస్మా థెరఫీ విధానం పెద్దగా ప్రభావం చూపడం లేదని దిల్లీ ఎయిమ్స్‌ స్పష్టంచేసింది. ఈ విషయం కొవిడ్‌ రోగులపై......

Published : 07 Aug 2020 03:05 IST

 మరింత పరిశోధన అవసరమన్న గులేరియా

దిల్లీ: కరోనా బాధితులపై ప్లాస్మా థెరపీ విధానం పెద్దగా ప్రభావం చూపడం లేదని దిల్లీ ఎయిమ్స్‌ స్పష్టంచేసింది. కొవిడ్‌ రోగులపై నిర్వహించిన ప్లాస్మా చికిత్స ఫలితాల ప్రాథమిక విశ్లేషణలో ఈ విషయం వెల్లడైందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు. ప్లాస్మా చికిత్స ఫలితాలను అంచనా వేసేందుకు 15 మంది కొవిడ్‌ రోగులతో కూడిన రెండు బృందాలపై పరిశీలన జరిపినట్టు వెల్లడించారు. అందులో ఒక బృందానికి సాధారణ విధానంలో చికిత్స అందించగా.. మరో 15 మందికి సాధారణ పద్ధతితో పాటు ప్లాస్మా చికిత్సను అందించినట్టు తెలిపారు. ఈ రెండు విధానాల్లోనూ మరణాల రేటు సమానంగా ఉన్నట్టు తమ ప్రాథమిక విశ్లేషణలో తేలినట్టు గులేరియా వెల్లడించారు. అయితే, దీనిపై స్పష్టత కోసం మరింత పరిశోధన అవసరమన్నారు. ప్లాస్మా థెరఫీ వల్ల కరోనా రోగులకు ఎలాంటి ప్రమాదమూ లేదన్న ఆయన.. అదే సమయంలో దీనివల్ల ప్రయోజనం కూడా లేదని పేర్కొన్నారు. 

ప్లాస్మా థెరపీ అంటే ఏంటి?
వైరస్‌ బారినపడి కోలుకున్న వారి రక్తంలోని ప్లాస్మాతో చేసే చికిత్సను ప్లాస్మా థెరపీ అంటారు. సాధారణంగా మన శరీరంలోకి బయటి నుంచి వైరస్‌ ప్రవేశించినప్పుడు దాంతో పోరాడేందుకు యాంటీబాడీస్‌ విడుదలవుతాయి. అప్పుడు శరీరం తట్టుకుని నిలబడుతుంది. తట్టుకోలేని శరీరాలు రోగం బారిన పడతాయి. మనకు నయమైన తర్వాత కూడా యాంటీబాడీస్‌ రక్తంలో ఉండిపోతాయి. వీటితో చేసే ప్లాస్మా థెరపీ ఒకరకంగా రక్తమార్పిడి లాంటిదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని