
ప్రపంచ ఆహార కార్యక్రమానికి శాంతి నోబెల్
ఓస్లో: ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారాన్ని ప్రపంచ ఆహార కార్యక్రమానికి(డబ్ల్యూఎఫ్‌పీ) ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొంటున్న ఆకలి సమస్యను తీర్చడానికి ఈ సంస్థ చేస్తున్న ప్రయత్నాలకు, సంక్షోభిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు చేసిన సేవలకుగానూ డబ్ల్యూఎఫ్‌పీని నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేశారు. సంక్షోభిత ప్రాంతాల్లో ఆకలిని ఆయుధంగా చేసుకోవడాన్ని ఈ కార్యక్రమం అరికడుతోందని నోబెల్ కమిటీ కితాబిచ్చింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ ఆహార కార్యక్రమం(డబ్ల్యూఎఫ్‌పీ) ప్రపంచంలోనే అతిపెద్ద మానవీయ సంస్థ. ఆకలి సమస్యను ఎదుర్కోవడం, ఆహార భద్రతపై అవగాహన కల్పించడంలో ఈ సంస్థ విశేష సేవలందిస్తోంది.
యుద్ధం, సంక్షోభ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు తీవ్రమైన ఆకలి బాధలకు గురవుతున్నారు. ఒక్క 2019లోనే 135 మిలియన్ల మంది ఆకలి సమస్యను ఎదుర్కొన్నారు. ఈ సమస్యను తీర్చడానికి, ఆకలి బాధలను నిర్మూలించేందుకు డబ్ల్యూఎఫ్‌పీ నిరంతరం కృషచేస్తోంది. ఇందులో భాగంగానే గతేడాది 88 దేశాల్లో దాదాపు 100 మిలియన్ల మంది అన్నార్థుల ఆకలి తీర్చింది డబ్ల్యూఎఫ్‌పీ.
ప్రస్తుతం ప్రపంచమంతా విలయతాండవం చేస్తోన్న కరోనా మహమ్మారి.. ఈ ఆకలి బాధలను మరింత పెంచింది. యెమెన్, కాంగో, నైజీరియా, దక్షిణ సూడాన్, బుర్కినాఫాసో లాంటి దేశాల్లో అటు హింసాత్మక ఘర్షణలు, ఇటు కరోనా వల్ల ఆకలి తీవ్ర రూపం దాల్చింది. ఈ దేశాల్లో తిండిలేక ఎంతో మంది విలవిల్లాడిపోతున్నారు. ఇలాంటి వారి కోసం డబ్ల్యూఎఫ్‌పీ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టింది. అంతేగాక, యుద్ధంతో సతమతమవుతున్న ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Umran Malik: ఉమ్రాన్ రాణిస్తున్నాడు.. ప్రపంచకప్ జట్టులో ఉండాలి : వెంగ్‌సర్కార్
-
General News
Weather Report: తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
-
India News
Bypoll Results: రెండు లోక్‌సభ స్థానాల్లో ఉత్కంఠ.. భాజపా, ఎస్పీల మధ్య హోరాహోరీ
-
General News
Telangana News: 19 లక్షల రేషన్‌కార్డుల రద్దుపై దర్యాప్తు చేయండి: ఎన్హెచ్ఆర్సీకి బండి సంజయ్ ఫిర్యాదు
-
Movies News
Cash Promo: ఏం మిస్ అయ్యానో ఇప్పుడు తెలుస్తోంది: గోపీచంద్
-
Crime News
Hyderabad: బాలికతో పెళ్లి చేయట్లేదని.. డీజిల్ పోసుకొని సజీవదహనం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్‌ఖాన్‌ని వదులుకున్నా!
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- AP Liquor: మద్యంలో విషం
- Teesta Setalvad: పోలీసుల అదుపులో తీస్తా సీతల్వాడ్
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- AP sachivalayam: జులై 1 నుంచి ప్రొబేషన్
- Atmakur ByElection: ఆత్మకూరు ఉపఎన్నిక.. వైకాపా ఏకపక్ష విజయం