ఒబామా, బిల్‌గేట్స్‌, బెజోస్‌..ట్విటర్‌ ఖాతాలు హ్యాక్‌!

ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఈసారి అంతర్జాతీయ ప్రముఖులు, సంపన్నులే లక్ష్యంగా హ్యాకర్లు వారి ట్విటర్‌ ఖాతాలపై...

Published : 16 Jul 2020 10:12 IST

మరికొందరి ప్రముఖుల ట్విటర్‌ ఖాతాలు హ్యాక్‌!

ధృవీకరించిన ట్విటర్‌ టీం, విచారణ జరుపుతున్నట్లు వెల్లడి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమం ట్విటర్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఈసారి అంతర్జాతీయ ప్రముఖులు, సంపన్నులే లక్ష్యంగా హ్యాకర్లు ట్విటర్‌ ఖాతాలపై దాడి చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, బిల్‌గేట్స్‌, వారెన్‌బఫెట్, అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బెజోస్‌, ఎలాన్‌ ముస్క్‌తో పాటు మరికొందరి ప్రముఖుల ట్విటర్‌ ఖాతాలు హ్యాక్‌ అయినట్లు సమాచారం. వీరి అధికారిక ఖాతాలలో అనుమానాస్పద ట్వీట్లు ప్రత్యక్షమయ్యాయి. వీటన్నింటిలోనూ క్రిప్టో కరెన్సీకి సంబంధించిన పోస్టులే ఉన్నాయి. దీంతో క్రిప్టోకరెన్సీ స్కాం ముఠానే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. 

ప్రముఖుల ఖాతాల హ్యాక్‌ విషయాన్ని ట్విటర్‌ సపోర్ట్‌ టీం అధికారికంగా ధ్రువీకరించింది. ప్రముఖుల ఖాతాలు హ్యాకర్ల బారినపడినట్లు గుర్తించిన వెంటనే వాటిని కాపాడామని ట్విటర్‌ సపోర్ట్‌ టీం వెల్లడించింది. ఆయా ట్వీట్‌లను ఇప్పటికే డిలీట్‌ చేసింది.‌ తాత్కాలికంగా ఆ ఖాతాలను నిలిపివేసినట్లు పేర్కొంది. ముఖ్యంగా వెరిఫైడ్‌ ఖాతాలే లక్ష్యంగా హ్యాకర్లు ఈ దాడికి పాల్పడ్డారని.. ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరపడంతోపాటు సెక్యూరిటీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ట్విటర్‌ బృందం ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని