
రంగంలోకి ఒబామా!
జోరుగా కొనసాగుతున్న అమెరికా ఎన్నికల ప్రచారం
వాషింగ్టన్: అత్యంత ప్రజాదరణ కలిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగనున్నారు. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారీస్‌కు మద్దతుగా ఒబామా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రచార కమిటీ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 21న ఫిలడేల్ఫియా, పెన్సిల్వేనియాలో జరిగే ప్రచారం కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఒబామా హయాంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై నాలుగేళ్లు గడుస్తున్నా.. ఒబామాకు ప్రజల్లో ఎంతో ఆదరణ ఉంది. మంచి వక్తగా పేరుంది. అందుకే ట్రంప్‌నకు దీటుగా ఆయనను ప్రచారంలోకి దింపాలని పార్టీ భావించింది. మరోవైపు ఒబామా ప్రచారంపై ట్రంప్ విమర్శలు చేశారు. ప్రజలపై ఆయన అంతగా ప్రభావం చూపలేరని వ్యాఖ్యానించారు. అందుకే 2016లో ప్రజలు తనకు పట్టం కట్టారన్నారు.
ట్రంప్ విభజించి సంతోషిస్తారు..
మరోవైపు ఓటింగ్ దగ్గరపడుతున్న కొద్దీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఇరు పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ట్రంప్ ప్రజల్లో విభజన తెచ్చేందుకు ఎంతదూరమైనా వెళతారని బైడెన్ ఆరోపించారు. విద్వేషాలు రెచ్చగొట్టి సంతోషిస్తారని విమర్శించారు. కరోనా వైరస్ విషయంలో ట్రంప్ ఇంకా కలల ప్రపంచంలోనే జీవిస్తున్నారన్నారు. ఏదో అద్భుతం జరిగి వైరస్ కనిపించకుండా పోతుందని కలలుగంటున్నారన్నారు.
బైడెన్ అవినీతిపరుడు..
అటు ట్రంప్ సైతం బైడెన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బైడెన్ అవినీతిపరుడని ఆరోపించారు. విఫల రాజకీయవేత్త అని విమర్శించారు. బైడెన్‌పై ఈ సందర్భంగా వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. మొత్తం కుటుంబంపై నేరారోపణలు ఉన్నాయన్నారు. సామాజిక మాధ్యమాలు, సాంకేతిక దిగ్గజ కంపెనీలపైనా ట్రంప్ విరుచుకుపడ్డారు. బైడెన్ ఎంత అవినీతిపరుడైనా మీడియా, సామాజిక మాధ్యమ సంస్థలు దాన్ని కప్పిపుచ్చుతున్నాయని ఆరోపించారు. వీరంతా లెఫ్ట్ వింగ్ రాజకీయాల్ని ప్రోత్సహిస్తున్నారన్నారు.
టీవీలో బైడెన్ జోరు..
మరోవైపు ఇప్పటి వరకు జరిపిన పలు సర్వేల్లో ట్రంప్ కంటే బైడెన్ రేసులో ముందున్నట్లు సమాచారం. మరోవైపు టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ బైడెనే దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. నీల్సన్ కంపెనీ వివరాల ప్రకారం.. గురువారం ఏబీసీలో ప్రసారమైన 90 నిమిషాల బైడెన్ చర్చా కార్యక్రమాన్ని 14.1 మిలియన్ల మంది వీక్షించారు. మరోవైపు ఎన్బీసీ, సీఎన్‌బీసీ, ఎంఎస్ఎన్బీసీ ఛానళ్లలో ప్రపారమైన ట్రంప్ 60 నిమిషాల చర్చా కార్యక్రమాన్ని 13.5 మిలియన్ల మంది చూశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27-06-2022)
-
World News
Most Expensive Pillow: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దిండు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
-
India News
Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
-
Technology News
WhatsApp: మహిళల కోసం వాట్సాప్‌లో కొత్త సదుపాయం
-
Sports News
Pakistan: ఒకరు విజయవంతమైతే.. మా సీనియర్లు తట్టుకోలేరు: పాక్ క్రికెటర్
-
Movies News
Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- కూనపై అలవోకగా..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- Bypolls: యూపీలో భాజపాకు బిగ్ బూస్ట్.. పంజాబ్‌లో ఆప్‌కు భంగపాటు
- PCOD: అధిక బరువుకు బై బై చెప్పేద్దామా.. పరిష్కార మార్గాలివిగో..!
- Health: వృద్ధాప్యం వస్తే ఏం తినాలో తెలుసా..?
- E Passport: ఈ పాస్‌పోర్ట్‌లు వస్తున్నాయ్.. ఎప్పటి నుంచి జారీ చేస్తారు?ఎలా పనిచేస్తాయి?