ఆ 42 మంది కరోనా రోగుల ఆచూకీ ఎక్కడ?

ఉత్తర్‌ ప్రదేశ్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ అక్కడ 42 మంది రోగులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.......

Updated : 31 Jul 2020 15:33 IST

ఘాజీపూర్‌: ఉత్తర్‌ ప్రదేశ్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతున్న వేళ అక్కడ 42 మంది రోగులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. ఘాజీపూర్‌లో కొందరు వ్యక్తులు ల్యాబ్‌లో స్వాబ్‌ ఇచ్చిన సందర్భంలో తప్పుడు ఫోన్‌ నంబర్లు, చిరునామాలు ఇవ్వడంతో వారి జాడ తెలియడంలేదు. దీంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మేరకు జిల్లా అదనపు మెజిస్ట్రేట్‌కు ఈ విషయాన్ని తెలుపుతూ అడిషనల్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కేకే వర్మ లేఖ రాశారు. 42 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొనేందుకు వచ్చి సరైన మొబైల్‌ నంబర్‌, చిరునామా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆ తర్వాత వారికి పాజిటివ్‌ వచ్చిందని వెల్లడించారు. వీరంతా ఆస్పత్రుల్లోగానీ, హోం క్వారంటైన్‌లో గానీ లేరని తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చిన కారణంగా వారిని గుర్తించడం తమకు కష్టతరంగా మారిందన్నారు.

ఫారంలో వారు పేర్కొన్న చిరునామా, ఫోన్‌ నంబర్లు తప్పు అని తేలడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని లేఖలో పేర్కొన్నారు. అదృశ్యమైన కరోనా రోగులను గుర్తించే ప్రక్రియ కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఘాజీపూర్‌లో కరోనాతో ఇప్పటివరకు 10మంది ప్రాణాలు కోల్పోగా.. ప్రస్తుతం 505 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని