ఆశాజనకంగానే ఆక్స్‌ఫర్డ్‌ టీకా!

కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు జరుగుతోన్న ప్రయత్నాల్లో ఊరట కలిగించే మరో విషయం తెలిసింది. ఆస్ట్రాజెనికాతో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తయారుచేసిన వ్యాక్సిన్‌ ఆశించిన ఫలితాలు ఇస్తున్నట్లు స్వతంత్ర పరిశోధనలో వెల్లడైంది. ఇది

Published : 23 Oct 2020 01:56 IST

స్వతంత్ర పరిశోధనలో వెల్లడి

లండన్‌: కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు జరుగుతోన్న ప్రయత్నాల్లో ఊరట కలిగించే మరో విషయం తెలిసింది. ఆస్ట్రాజెనికాతో కలిసి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తయారుచేసిన వ్యాక్సిన్‌ ఆశించిన ఫలితాలు ఇస్తున్నట్లు స్వతంత్ర పరిశోధనలో వెల్లడైంది. ఇది వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో శుభపరిణామమని పరిశోధకులు వెల్లడించారు. ప్రయోగదశల్లో ఉన్న వ్యాక్సిన్‌.. జెనెటిక్‌ సూచనలు పాటిస్తుందో? లేదో అనే విషయాన్ని తెలుసుకునేందుకు బ్రిస్టల్‌ యూనివర్సిటీ బృందం పరిశోధన మొదలుపెట్టింది. ఇందుకోసం ఇటీవలే అభివృద్ధి చేసిన నూతన పద్ధతులను ప్రయోగించింది. అనంతరం, రోగ నిరోధకతను వ్యాక్సిన్‌ ఏవిధంగా ఉత్తేజపరుస్తుందోననే విషయాలు సవివరంగా, అత్యంత స్పష్టంగా తెలిసినట్లు పరిశోధన బృందం వెల్లడించింది. తాజాగా ఈ పరిశోధన పత్రం ‘రీసెర్చ్‌ స్క్వేర్‌’లో ప్రచురితమైంది.

మానవ శరీరంలోకి వెళ్లిన తర్వాత జన్యు సూచనలను ఈ వ్యాక్సిన్‌ పాటిస్తుందో? లేదో? అనే విషయం తెలుసుకోవడంలో ఈ పరిశోధన ఎంతో ముఖ్యమైందని బ్రిస్టల్స్‌ స్కూల్‌ ఆఫ్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యూలర్‌ మెడిసిన్‌(సీఎంఎం)కు చెందిన వైరాలజీ శాస్త్రవేత్త డాక్టర్‌ డేవిడ్‌ మాథ్యూస్‌ వెల్లడించారు. ‘ఇలాంటి స్పష్టమైన సమాచారాన్ని ఇప్పటివరకు ఉన్న టెక్నాలజీ ఇవ్వలేకపోయింది. కానీ, ప్రస్తుతం నూతన సాంకేతికత సహాయంతో వీటికి సంబంధించిన పూర్తి విశ్లేషణను తెలుసుకున్నాం. ప్రతిపనిని మేము ఊహించినట్లుగానే నిర్వహిస్తోన్నట్లు పరిశోధనలో తేలింది’ అని డేవిడ్‌ మాథ్యూస్‌ పేర్కొన్నారు. ఇది వైరస్‌పై పోరులో శుభపరిణామమని,  ప్రపంచవ్యాప్తంగా ఉన్న నియంత్రణ సంస్థలకు ఉపయుక్తమైన కీలక సమాచారాన్ని ఈ పరిశోధన అందిస్తుందని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని