ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాలు మళ్లీ షురూ

కొవిడ్‌ వ్యాక్సిన్‌ రేసులో ముందంజలో ఉన్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాలు మళ్లీ మొదలయ్యాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్‌ను.....

Published : 13 Sep 2020 01:12 IST

లండన్‌: కొవిడ్‌ వ్యాక్సిన్‌ రేసులో ముందంజలో ఉన్న ఆక్స్‌ఫర్డ్‌ టీకా ప్రయోగాలు మళ్లీ మొదలయ్యాయి. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్‌ను బ్రిటన్‌లో వేయించుకున్న ఓ వాలంటీరులో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రయోగాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. బ్రిటీష్‌ రెగ్యులేటర్స్‌ నుంచి అన్ని అనుమతులూ రావడంతో తిరిగి ప్రయోగాలు బ్రిటన్‌లో తిరిగి ప్రారంభించినట్లు ఆస్ట్రాజెనెకా ఓ ప్రకటనలో తెలిపింది.

వాలంటీరులో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో టీకా ప్రయోగాలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు బుధవారం ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. దీంతో ఈ వ్యాక్సిన్‌ భద్రతను సమీక్షించేందుకు ఓ స్వతంత్ర కమిటీ ఏర్పాటైంది. దర్యాప్తు చేసిన ఈ కమిటీ వ్యాక్సిన్‌ భద్రమేనని, ప్రయోగాలు ప్రారంభించొచ్చని మెడిసిన్స్‌ హెల్త్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఎంహెచ్‌ఆర్‌ఏ)కి సిఫార్సు చేసింది. దీంతో ఎంహెచ్‌ఆర్‌ఏ నుంచి అనుమతులు రావడంతో ప్రయోగాలను తిరిగి ప్రారంభించినట్లు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ ప్రయోగాలు చేపడుతున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌.. డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) సూచనల మేరకు ప్రయోగాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని