ఆగస్టు 5న రామమందిరం భూమిపూజ

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ..

Published : 20 Jul 2020 01:44 IST

అయోధ్యలో రెండు గంటలపాటు పర్యటించనున్న ప్రధాని

దిల్లీ: అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 5వ తేదీన భూమిపూజ చేయనున్నట్లు పూజారులు వెల్లడించారు. అయోధ్యలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.10 గంటల వరకు ప్రధాని పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆగస్టు 3వ తేదీ నుంచే నిర్మాణ వేడుకలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 4న రామాచార్య పూజ, 5వ తేదీ 12.15 గంటలకు భూమిపూజ చేసేందుకు నిర్ణయించారు. రామమందిరం ప్రాంతంతోపాటు, అయోధ్యలో ప్రధాని మోదీ మొదటిసారి పర్యటించనున్నారు. 

‘ఆగస్టు 3 లేదా 5వ తేదీన రామమందిరం భూమి పూజకు రావాలని ప్రధాని మోదీకి విన్నవించాం. పూజ చేసిన రోజే నిర్మాణ పనులను ప్రారంభించనున్నాం’ అని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారి శనివారం వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 5న రామమందిరం నిర్మాణం మొదలవుతుందని ప్రధాని పేర్కొన్నారు. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మాణానికి సుప్రీంకోర్టు గత నవంబర్‌లో అనుమతించింది. ప్రత్యామ్నాయంగా కొత్త మసీదు నిర్మించుకునేందుకు సున్నీ వక్ఫ్ బోర్డుకు పట్టణంలోని ప్రముఖ ప్రదేశంలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు