ఆత్మనిర్భర్ ఆలోచన కూడా అక్కడిదే: మోదీ

విద్యాసంస్థలు దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన సిద్ధాంతపరమైన ఉద్యమాలకు కొత్త శక్తిని ఇచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Updated : 24 Dec 2020 13:47 IST

విశ్వ భారతి విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల్లో ప్రసంగించిన మోదీ

కోల్‌కతా: విద్యాసంస్థలు దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన సిద్ధాంతపరమైన ఉద్యమాలకు కొత్త శక్తిని ఇచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గురువారం పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌కు చెందిన ‘విశ్వ భారతి విశ్వవిద్యాలయ’ శతాబ్ది వేడుకల్లో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ క్రమంలో నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ దేశానికి అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు.

విశ్వ భారతి వంద సంవత్సరాల ప్రయాణం చాలా ప్రత్యేకమైందని మోదీ అభివర్ణించారు. ఈ విద్యాసంస్థ గురుదేవ్ దూరదృష్టి, కృషికి నిదర్శనమని ఆయన అన్నారు. అంతర్జాతీయ  సౌరకూటమి, పారిస్ ఒప్పందం ద్వారా పర్యావరణ లక్ష్యాలను సాధించడానికి సరైన మార్గంలో ప్రయాణిస్తున్న ఏకైక దేశం మనదేనని ఈ సందర్భంగా ప్రధాని వెల్లడించారు. రవీంద్రనాథ్‌ మార్గదర్శకత్వంలో దేశంలో జాతీయవాద భావనలను పెంపొందించేందుకు ఈ సంస్థ దోహదం చేసిందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కూడా ఈ సెంటిమెంట్‌ నుంచి వికసించిన ఆలోచనేనని వెల్లడించారు. విశ్వ భారతి ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులను మనం గుర్తుంచుకోవాలని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధనకర్‌, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్ కూడా పాల్గొన్నారు. 

ఇవీ చదవండి:

కరోనా: ఆ దేశ ప్రధానిపై రూ.900 కోట్ల దావా

25న రైతులతో మాట్లాడనున్న మోదీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు