Updated : 28 Dec 2020 13:18 IST

తొలి డ్రైవర్‌ రహిత రైలు.. ప్రారంభించిన మోదీ

దిల్లీ: దేశంలోనే తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. దిల్లీ మెట్రోకు సంబంధించి.. పశ్చిమ జనక్‌పురి-బొటానికల్‌ గార్డెన్‌ మధ్య 37 కిలోమీటర్ల పొడవున్న మెజంటా లైన్‌లో ఈ రైలును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని ఆవిష్కరించారు. నేటి నుంచే ఈ సేవలు అందుబాటులోకి  రానున్నాయి.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నడిచే మెరుగైన రవాణా వ్యవస్థకు సంబంధించి నవ శకానికి ఇది ప్రారంభమని  దిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(డీఎంఆర్‌సీ) పేర్కొంది. మజ్లిస్‌ పార్క్‌-శివ్‌ విహార్‌ మధ్య 57 కిలోమీటర్ల పొడవున్న పింక్‌ లైన్‌ మార్గంలోనూ చోదకరహిత మెట్రో రైలు సేవలను 2021 మధ్యకాలం నాటికి విస్తరించనున్నట్లు వెల్లడించింది. పింక్‌ లైన్‌ కూడా ప్రారంభమైతే.. దిల్లీ మెట్రోలో 94 కిలోమీటర్ల మేర డ్రైవర్‌ రహిత రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ప్రపంచంలోని డ్రైవర్‌ రహిత మెట్రో మార్గంలో ఇది సుమారు 9 శాతం అని డీఎంఆర్‌సీ పేర్కొంది.

‘స్మార్ట్ వ్యవస్థపై భారత్ ఎంతగా వేగంగా అభివృద్ధి చెందుతుందో ఈ రైలు ప్రారంభం వెల్లడిస్తోంది. నేషనల్ కామన్‌ మొబిలిటీ కార్డ్(ఎన్‌సీఎంసీ) ద్వారా దిల్లీ మెట్రో అనుసంధానం అయింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు స్మార్ట్ వ్యవస్థపై అంతగా దృష్టి పెట్టలేదు. అప్పట్లో నిరాసక్త వాతావరణం ఉండేది. పట్టణీకరణ, సాంకేతిక అభివృద్ధి మధ్య చాలా తేడా కనిపించింది. దాన్ని మా ప్రభుత్వం మార్చింది. పట్టణీకరణను సులభతర జీవన శైలికి ఒక అవకాశంగా పరిగణించాలి’ అని ఈ సందర్భంగా మోదీ వెల్లడించారు. 

ఇవీ చదవండి..

భారత్‌లో తయారీ వస్తువులే వాడుదాం

విదేశాల నుంచి వస్తే 14 రోజుల క్వారంటైన్‌!

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని