రాజమాత పేరుతో మరో రూ.100 నాణెం!

రాజమాత విజయరాజే సింధియా శతజయంతి సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ ముద్రించిన వందరూపాయల నాణాన్ని నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.

Published : 12 Oct 2020 15:50 IST

శతజయంతి సందర్భంగా ఆవిష్కరించిన ప్రధాని మోదీ

దిల్లీ: రాజమాత విజయరాజే సింధియా శతజయంతి సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ ముద్రించిన వందరూపాయల నాణాన్ని నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. స్వాతంత్ర్య ఉద్యమకాలం నాటినుంచి భారత రాజకీయాల్లో రాజమాత కీలక పాత్ర పోషించారని ప్రధాని మోదీ కొనియాడారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానితోపాటు రాజమాత కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

ట్రిపుల్‌ తలాక్‌కు వ్యతిరేకచట్టాన్ని రూపొందించి, మహిళా సాధికారతపై రాజమాత ఆలోచనలను ముందుకు తీసుకెళ్లామని అన్నారు. ఏక్తా యాత్ర సందర్భంగా దేశానికి యువ నేతగా తనను పరిచయం చేశారని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. సామాన్యురాలిగా, గ్రామాల్లో పేదవారితో రాజమాత తన జీవితాన్ని గడిపారని..వారికోసమే తన జీవితాన్ని అంకితం చేశారని అభిప్రాయపడ్డారు. ప్రజాప్రతినిధులకు అధికారం కన్నా ప్రజాసేవే ముఖ్యమనే విషయాన్ని రాజమాత విజయరాజే సింధియా నిరూపించారని ప్రధాని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని