రూ.75 నాణేన్ని విడుదల చేసిన ప్రధాని

ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) 75 వసంతాలు పూర్తి చేసున్న సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవ వేడుకల్లో రూ.75 స్మారక నాణేన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. దేశంలో పోషకాహార లోపాన్ని పరిష్కరించడానికి అవసరమైన పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి చేసిన 17 రకాల కొత్త పంటలను మోదీ ఆవిష్కరించారు...

Published : 16 Oct 2020 13:13 IST

దిల్లీ: ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవ వేడుకల్లో రూ.75 స్మారక నాణేన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. దేశంలో పోషకాహార లోపం సమస్యను పరిష్కరించడానికి అవసరమైన పంటలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి చేసిన 17 రకాల కొత్త పంటలను మోదీ ఆవిష్కరించారు. వీటి వల్ల  రైతులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. ధాన్యం, గోధుమల ఉత్పత్తిలో దేశంలోని పాతరికార్డులన్నీ చెరిగిపోయాయన్నారు. రైతులకు కనీస మద్ధతు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఇది ఆహార భద్రతకు ఎంతో అవసరమని మోదీ వెల్లడించారు. సరైన వసతులు లేనందువల్ల ఆహారధాన్యాలను నిల్వ చేసుకోవడం సమస్యగా మారుతోందని, దీనిని నివారించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులు మరింత లబ్ధిపొందుతారని ప్రధాని మోదీ అన్నారు. ఈఏడాది నోబెల్‌ శాంతి బహుమతిని ప్రపంచ ఆహార కార్యక్రమానికి ప్రకటించడాన్ని మోదీ ఆహ్వానించారు. అందులో భారత్ కూడా భాగస్వామ్యమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మరోవైపు పెళ్లి వయస్సు ఎంత ఉండాలన్న దానిపై తనకు లేఖలు వస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ఈ అంశంపై చర్చలు నడుస్తున్నాయని, దీనిపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత నూతన చట్టం రూపొందిస్తామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని