వాజ్‌పేయీ నాయకత్వమే దేశాభివృద్దికి కారణం: మోదీ

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ 96వ జయంతి సందర్భంగా  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్,‌  ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు ఆయనకు నివాళులు అర్పించారు.

Updated : 25 Dec 2020 12:52 IST

దిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ 96వ జయంతి సందర్భంగా  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్,‌  ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు ఆయనకు నివాళులు అర్పించారు. దిల్లీలో రాష్ట్రీయ స్మృతి స్థల్‌ సమీపంలో నిర్మించిన ‘సదైవ్ అటల్‌’ను వారు శుక్రవారం ఉదయం సందర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. ‘ముందుచూపుతో కూడిన వాజ్‌పేయీ నాయకత్వం దేశాభివృద్ధికి దోహదం చేసింది. బలమైన, సుసంపన్నమైన భారత్‌ను నిర్మించడానికి ఆయన చేసిన ప్రయత్నాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి’ అని కొనియాడారు. అలాగే వాజ్‌పేయీ స్మారకార్థం ‘పార్లమెంట్‌లో అటల్ బిహారీ వాజ్‌పేయీ: స్మారక సంపుటి’ పేరిట పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. ఆయన జ్ఞాపకార్థం భాజపా ప్రభుత్వం డిసెంబర్ 25ను ‘సుపరిపాలన దినోత్సవం’ గా జరుపుతోన్న సంగతి తెలిసిందే.

ఇదే రోజు మదన్‌ మోహన్‌ మాలవీయ జయంతి కూడా. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను మోదీ స్మరించుకున్నారు. ‘ఆయన తన జీవితాన్ని సాంఘిక సంస్కరణలకే అంకితం చేశారు. దేశానికి ఆయన చేసిన సేవలు భవిష్యత్తు తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుంటాయి’ అని నివాళులు అర్పించారు.  

ఇవీ చదవండి:

30వ రోజూ..అదే ప్రతిష్టంభన..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని